● కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశం
నిజామాబాద్‌అర్బన్: విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంఈవోలకు సూచించారు. ఏదైనా విద్యాసంస్థలో అతిసారం, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదైతే సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయం ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంఈవోలతో కలెక్టర్ సమీక్ష జరిపారు. కేజీబీవీ, పాఠశాలల్లో నూ తన భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డ్రైనేజీల నిర్మాణ ప్రగతిని సమీక్షిస్తూ, పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పలుచోట్ల పనులు మందకొడిగా సాగుతుండటంపై అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మంజూరు లభించని పక్షంలో వీబీజీ రాంజీ కింద ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ వందశాతం అమలు చేయాలని, లేనిపక్షంలో జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. కేజీబీవీ, ప్రభుత్వ బడులతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిని, నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని మండల ప్రత్యేక అధికారులకు, ఎంఈవోలకు సూచించారు. అద నపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి జిల్లా విద్యా శా ఖ అధికారి సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


