ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

నిజామాబాద్‌ రూరల్‌: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెంచే విధంగా జీపీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, సర్పంచులు చొరవ తీసుకోవాలని డీఆర్‌డీవో సాయన్న అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన 16 విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభవం చాలా ఉందని, గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలస వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రతి నీటిని ఒడిసి పట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు రైతులకు ఫాంపాండ్‌ల నిర్మాణం గురించి అవగాహన కల్పించాలన్నారు.

రైతులు ఆరు తడి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంనారాయణ, ఎంపీవో ఎక్బాల్‌, ఏపీఎం పద్మ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement