ముప్కాల్(వేల్పూర్) : తన భూమిని ముసుగు భూమేశ్వర్ అనే వ్యక్తి కబ్జా చేసి హద్దురాళ్లను పాతారంటూ ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన గద్దల గంగారాం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 389 లో ఉన్న భూమిని భూమేశ్వర్ కబ్జా చేశారని, దీనిని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషి స్తూ చంపుతానని బెదిరించారని ఆరోపించా రు.తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు.
ఖలీల్‌వాడి:జిల్లాలో సోమవారం ఓపెన్ ఎస్సె స్సీ, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్ తెలిపారు. ఎస్సె స్సీ తెలుగు పరీక్షకు 83 మందికి గాను 65 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే ఇంటర్ తె లుగు పరీక్షకు 193 మందికి గాను 151 మంది హాజరైనట్లు వివరించారు. మధ్యాహ్నం జరి గిన ఓపెన్ ఎస్సెస్సీ సైకాలజీలో ఒకరు హాజ రు, ఇంటర్మీడియట్ అరబిక్ పరీక్షకు 11 మందికి గాను 10 మంది హాజరైనట్లు తెలిపారు.
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో ఈనెల 18న సీనియర్ మహిళల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, గంగాధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారిని ఈనెల 28 నుంచి 31 వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జ రిగే రాష్ట్రస్థాయి టోర్నీకి పంపనున్నట్లు తెలిపా రు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డుతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94403 55999, 99898 14410ను సంప్రదించాలని సూచించారు.
నిజామాబాద్ రూరల్: జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నికయ్యారు. నగరంలోని ఖలీల్‌వాడిలోగల జిల్లా పద్మశాలి సంఘంలో సోమవారం జిల్లా పద్మశాలి సంఘం సర్వసభ్యసమావేశం నిర్వహించగా, భోగ ఆశోక్‌ను గౌరవ అధ్యక్షులుగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనను సభ్యులు సన్మానించారు. దాసరి నర్సింలు, మైసల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: చిన్నారులకు ఇచ్చే టీకాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, టీకాలు తీసుకోని పిల్లలకు తప్పనిసరిగా టీకా ఇచ్చే ప్రయత్నం చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సిబ్బందికి సూచించారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఆమె వ్యాధి నిరోధక టీకాలు, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం, ఎస్‌ఎన్‌సీయూ విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌లు తీసుకునే పిల్లలకు పెండింగ్‌లో ఉన్న టీకాలను పూర్తిచేయాలన్నారు. ఆర్‌బీఎస్‌కే మొబైల్ టీంల ద్వారా పాఠశాలల్లో, అంగన్‌వాడీ సెంటర్లలో ఏ ఒక్క విద్యార్థి కూడా రక్తహీనత బాధపడకుండా చూడాలన్నారు. డీఐవో అశోక్, డాక్టర్ నిరూపారెడ్డి, మెడికల్ ఆఫీసర్స్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: ఇటీవల చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు విచారణ చేశారు. విచారణలో భాగంగా కొన్ని అనుమానస్పదంగా ఉండటంతో కామారెడ్డికి చెందిన ప్రత్యేకాధికారి కుటుంబరావు సోమవారం మండలంలో మరోసారి విచారణ చేపట్టారు. కొంతమంది జతచేసిన ధృవీకరణ పత్రాలు అనుమానస్పదంగా ఉండటంతో విచారణ చేపడుతున్నామన్నాని అధికారి తెలిపారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.
రాజంపేట (భిక్కనూరు): రాజంపేట మండలం పె ద్దాయిపల్లి గ్రామానికి చెందిన చిన్నారి గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన గాడి లక్ష్మి–పవన్‌ల కుమార్తె మహన్వి త (10) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి మహన్విత తనకు ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిన్నారి మహన్విత మృతితో గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, బంధువులు మహన్వితకు కన్నీటి వీడ్కోలు పలికారు.


