కమ్మర్పల్లి(భీమ్‌గల్): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా..మండలంలో ని చౌడా తండాకు చెందిన ర మావత్ రవి(38) శనివారం తన నాలుగేళ్ల కొడుకు జస్వంత్‌తో కలిసి స్కూటీపై భీమ్‌గల్‌లోని ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా పల్లికొండ శివారులో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో రవితోపాటు కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● కాపాడిన మత్స్యకారులు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానిక మ త్స్యకారులు కాపాడారు. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని జీజీ నడ్కుడ గ్రామానికి చెందిన సుద్ద నరేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడానికి సోమవారం చిన్నయానం బ్యాక్ వాటర్ శివారుకు తన ఆటో తీసుకు ని వచ్చాడు. ఆటోను ఒడ్డున ఆపి ప్రాజెక్టు బ్యాక్ వా టర్లోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ చేపల వేట సాగిస్తున్న స్థానిక మత్స్యకారులు నరేశ్ నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించారు.వారు వెంట నే స్పందించి తెప్పలపై చేరుకుని నరేశ్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారు నరేశ్ కు టుంబ సభ్యులకు సమాచారం అందించగా ఘట నా స్థలానికి చేరుకుని అతడిని ఇంటికి తీసుకెళ్లారు.


