పనిమనిషే హంతకురాలు | - | Sakshi
Sakshi News home page

పనిమనిషే హంతకురాలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

● కామారెడ్డిలో వృద్ధురాలి హత్య కేసును

ఛేదించిన పోలీసులు

● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించా రు. బంగారు ఆభరణాలను దోచుకునేందుకు తన భర్తతో కలిసి పనిమనిషి ఈ దారుణానికి ఒడిగట్టిన ట్లు తేల్చారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని ముస్రిఫ్‌బాగ్‌ కు చెందిన చిట్మల్ల అనసూయ(66) అనే మహిళ గ త నెల 29న సాయంత్రం హత్యకు గురయ్యింది. హ తురాలి భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె మెడపై గాయా లు ఉండడంతో పాటు మెడలో పుస్తె ల తాడు,ఉంగరాలు, చెవి ఆభరణాలు కనిపించకపోవడంతో పో లీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీ సులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్య, దోపి డీ కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. బతుకమ్మ కుంటలో నివసించే పనిమనిషి బోసు రజితను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్త నర్సింగ్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు నిందితురాలు నేరాన్ని అంగీకరించిందని ఎస్పీ తెలిపారు.

పక్కా ప్రణాళికతో...

పనిమనిషి రజిత తన యజమానురాలు అనసూ య మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దో చుకునేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అనసూయ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లి న సమయాన్ని అనుకూలంగా మలచుకుంది. గతనెల 29న సాయంత్రం అనసూయ ఇంట్లో దీపం వెలిగిస్తుండగా.. ర జిత, ఆమె భర్త నర్సింగ్‌ కరెంటు సరఫరా నిలిపివేసి ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధురాలిని కింద పడేసి లోపలి గదిలోకి ఈడ్చుకెళ్లి తువ్వాలను గొంతుకు బిగించి చంపారు. ఒంటిపైనున్న పుస్తెలతాడు, రెండు ఉంగరాలు, కమ్మలు తీసుకుని పారిపోయారు. ఏమీ ఎరుగనట్లు ఎప్పటిలాగే రోజూ పనికివస్తున్న రజిత.. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించింది.

గతంలోనూ దొంగతనం..

హత్య, దోపిడీ కేసుల్లో నిందితురాలైన రజిత.. గతంలోనూ తాను పనిచేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది. 2023 సెప్టెంబర్‌లో తాను పనిచేసిన ఇంట్లో ఎవ రూ లేని సమయంలో నాలుగు తులాల బంగారు పు స్తెల తాడు, బంగారు చెవికమ్మలు దొంగలించినట్టు పనిమనిషి రజిత చెప్పిందని ఎస్పీ తెలిపారు. అప్ప ట్లో మూసివేసిన ఆ కేసును రీఓపెన్‌ చేస్తున్నామన్నా రు. దోపిడీ, హత్య కేసులో భార్యాభర్తలిద్దరినీ రి మాండుకు పంపుతున్నామన్నారు. వారి వద్దనుంచి బంగారు పుస్తెలతాడు, రెండు బంగారం ఉంగరా లు, చెవి ఆభరణాలు, నిందితురాలి సెల్‌ఫోన్‌ స్వాధీ నం చేసుకున్నామన్నారు. కేసు పరిశోధనకు సంబంధించి డీఎస్పీ మధుసూదన్‌, సీఐ నరహరిలను ఎ స్పీ అభినందించారు. ఎస్సై సాయికృష్ణ, ఏఎస్సై రంగారావ్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు రామస్వామి, రాజునాయక్‌, సంపత్‌లకు క్యాష్‌ రివార్డులు అందించారు.

గత చరిత్ర తెలుసుకోవాలి

ఇళ్లలో ఎవరిని పడితే వారిని పనిమనుషులుగా పె ట్టుకోవవద్దని ఎస్పీ రాజేశ్‌చంద్ర సూచించారు. పని కి వచ్చే వారి గత చరిత్ర తెలుసుకోవాలని, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటేనే పనిలో పెట్టుకోవాలన్నారు. కిరాయి కావాలంటూ వచ్చే వ్యక్తుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి

అనసూయను హతమార్చిన భార్యాభర్తలిద్దరినీ కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన కుటుంబ సభ్యులు.. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దన్నారు. చట్టం ప్రకారం వారికి శిక్ష పడేలా న్యాయస్థానం ముందు అన్ని వివరాలు ఇస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement