● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ప్రజల నుంచి 89 వినతుల స్వీకరణ
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పుష్కర్ ఘట్ ప్రాంతాలకు వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు వెయ్యాలని పలు గ్రామల సర్పంచ్‌లు ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. నవీపేట్, నందిపేట్ మండలాలకు చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ.. రానున్న పుష్కరాల నేపథ్యంలో నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి గ్రామం నుంచి నవీపేట్ మండలం తుంగిని వరకు రోడ్డును విస్తరించాలన్నారు.


