సుభాష్‌నగర్: రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా టోర్నీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లు ఉత్తమ ప్రతిభ కనబర్చాయి. ఖమ్మం జిల్లా వైరాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 12వ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా(లెగ్ వాలీవాల్) చాంపియన్ షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి పురుషులు, మహిళల జట్లు పాల్గొనగా, జిల్లా సీనియర్ మహిళల జట్టు రెండోస్థానంలో, పురుషుల జట్టు మూడోస్థానం కై వసం చేసుకున్నాయని అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి గాదారి సంజీవ్‌రెడ్డి తెలిపారు.
మహిళా జట్టులో రిక్కిరెడ్డి, లక్కిరెడ్డి, పురుషుల జట్టులో పవన్ కళ్యాణ్, సాత్విక్, రుత్విక్, అనిష్ విజయంలో కీలకపాత్ర వహించారన్నారు. సెపక్ తక్రా రాష్ట్ర ప్రధానకార్యదర్శి రిక్క శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి, మధు, స్థానిక ఎస్‌ఐ రామారావు, అంతర్జాతీయ క్రీడాకారులు శశిధర్‌రెడ్డి, నాగార్జున, రామకృష్ణారెడ్డి, తదితరుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.


