అత్యాధునిక సాంకేతికతతో ‘లయన్స్‌’ వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

అత్యాధునిక సాంకేతికతతో ‘లయన్స్‌’ వైద్య సేవలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

బోధన్‌: పేద ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లయన్స్‌క్లబ్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు లయన్స్‌ క్లబ్‌ పాస్ట్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ మూడో వైస్‌ప్రెసిడెంట్‌ అభ్యర్థి విజయకుమార్‌ రాజు అన్నారు. పట్టణంలోని లయ న్స్‌ కంటి ఆస్పత్రిలో ఎల్‌సీఐఎఫ్‌ సహకారంతో రూ.కోటి 20 లక్షలతో ఏర్పాటు చేసిన మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌, అత్యాధునిక వైద్య పరికరాల ను సోమవారం ఆయన, క్లబ్‌ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా విజయకుమార్‌ రాజు మాట్లాడుతూ.. పేదలకు వైద్యసేవలందిస్తు న్న కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు పోలవరపు బసవేశ్వర్‌రావును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లయన్స్‌ కంటి ఆస్పత్రికి సెంటర్‌ ఆఫ్‌ ఎ క్స్‌లెన్స్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తానన్నారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో లయన్స్‌ బహుధాన్యపురం, ఏకచక్ర రీజియన్‌ పరిధిలోని క్లబ్‌లు వితరణ చేసిన 26 కుట్టుమిషన్లు, పీ పుల్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ వితరణ చేసిన 46 వీల్‌చైర్లను మహిళలు, దివ్యాంగులకు పంపిణీ చేశారు. లయన్స్‌ కంటి ఆస్పత్రిని మల్టీసూపర్‌స్పెషాలిటీ హస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అందరూ సహకరించాలని కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వరావు కోరారు. లయన్స్‌ ప్రతినిధులు ఘట్టమనేని బాపురావు, విజయలక్ష్మి, గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌నాథ్‌రావు, హరీశ్‌రెడ్డి, నర్సింహరెడ్డి, నాగేశ్వర్‌రావు, దుర్గారావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement