సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు పేకాడుతున్న 16మంది అరెస్టు ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

నిజామాబాద్‌అర్బన్‌: రైల్వే స్టేషన్‌లో తరచూ సెల్‌ఫోన్‌లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. నగరంలోని ముజాహిద్‌ నగర్‌కు చెందిన కమురుద్దీన్‌ షేక్‌ సోమవారం రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచారించామన్నారు. దీంతో అతడి వద్ద ఐదు మొబైల్‌ ఫోన్లు లభించినట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై గతంలో కూడా సెల్‌ఫోన్‌ దొంగతనం చేసిన కేసులు నమోదైనట్లు తెలిపారు. అనంతరం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించినట్లు వివరించారు.

కమ్మర్‌పల్లి: మండలంలోని హసకొత్తూర్‌లో ఆదివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సతీష్‌ తన సిబ్బందితో కలిసి హసకొత్తూర్‌ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేశారు. 16 మందిని పట్టుకోగా, ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ. 21వేల నగదు, 15 సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి ఫా రెస్టు రేంజ్‌ పరిధిలోని యాచా రం బీట్‌ కంపార్ట్‌మెంటు 466/1 నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని స్వాధీననం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్వో రమేష్‌ సోమవారం తెలిపారు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ యజమాని సాయిలుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement