రూఫ్‌టాప్‌ కరెంట్‌ | - | Sakshi
Sakshi News home page

రూఫ్‌టాప్‌ కరెంట్‌

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

ఇంటిపై సోలార్‌తో జీరో విద్యుత్‌ బిల్లు

సుభాష్‌నగర్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, రోజురోజుకూ విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరగడం, దీనికితోడు విద్యుత్‌ బిల్లులు కూడా పెరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ – ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకం తీసుకొచ్చింది. ఈపథకం కింద గృహ విద్యుత్‌ వినియోగదారుల ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌తో విద్యుత్‌ బిల్లులకు చెక్‌ పడనుంది. కేంద్రం అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకుని అనేకమంది వినియోగదారులు సౌర విద్యుత్‌ వైపు మళ్లుతున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వినియోగం ద్వారా సంప్రదాయ విద్యుత్‌ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.

రాయితీలు ఇలా..

ఒక కిలో వాట్‌ సోలార్‌ ప్లాంట్‌కు రూ.30వేలు, రెండో కిలోవాట్లకు రూ.60వేలు, మూడు కిలోవాట్స్‌ అంతకన్నా ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా రూ.78వేల వరకు సబ్సిడీ వర్తిస్తోంది. రాయితీలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్లాంట్‌ ఏర్పాటుకు అయ్యే ప్రారంభ వ్యయం తగ్గుతుంది. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా అనుకూల పరిస్థితుల్లో నెలకు 360 యూనిట్లకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు, పైకప్పుపై సూర్యరశ్మి లభ్యత, ప్లాంట్‌ పనితీరు ఆధారంగా ఉత్పత్తి మారుతుంది. ఇంటి విద్యుత్‌ వినియోగం సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు అనుగుణంగా ఉంటే విద్యుత్‌ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

● కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https:// pmsuryaghar.gov.in ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

● రిజిస్ట్రేషన్‌, ఆమోదిత విక్రేత ఎంపిక, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తనిఖీ, నెట్‌ మీటరింగ్‌, సబ్సిడీ పొందే ప్రక్రియను పథకం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలి.

● సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునే ముందు తమ ఇంటి విద్యుత్‌ వినియోగం, అవసరమైన ప్లాంట్‌ సామర్థ్యం, పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, మొత్తం వ్యయం, సబ్సిడీ అర్హత వివరాలను పరిశీలించుకోవాలి.

● మార్కెట్‌లో అనేక సోలార్‌ ప్లేట్ల కంపెనీలు, వెండర్స్‌ (డిస్టిబ్యూటర్స్‌) అందుబాటులోకి వచ్చాయి.

సౌర విద్యుత్‌తో బిల్లులకు చెక్‌

ప్రతినెలా 100 వరకు మంజూరు

నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ప్రతినెలా 100 వరకు ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లను మంజూరు చేస్తున్నాం. సౌర విద్యుత్‌పై ప్ర జల్లో మంచి అవగాహన వ చ్చింది. ఇటీవల టీజీఎన్‌పీడీసీఎల్‌, రెడ్‌ కో ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పలు కంపెనీలు, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సదస్సు నిర్వహించాం. చాలా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

– పీవీ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్‌

ఇంటి పైకప్పులపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మి సహాయంతో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గ్రిడ్‌ నుంచి తీసుకునే విద్యుత్‌ వినియోగం తగ్గి, నెలవారీ విద్యుత్‌ బిల్లుపై గణనీయమైన ఆదా పొందే అవకాశం ఉంటుంది. సోలార్‌ ప్లాంట్‌ సామర్థ్యం, ఇంటి విద్యుత్‌ వినియోగం, సౌర విద్యుత్‌ ఉత్పత్తి బట్టి విద్యుత్‌ బిల్లు జీరో అవుతుంది. బ్యాంకులు కూడా అతి తక్కువ వడ్డీ రేట్లకే రుణ సదుపాయం కల్పిస్తూ, నెలవారీగా (ఈఎంఐ) చెల్లించే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

పీఎం సూర్య ఘర్‌తో వినియోగదారులను ప్రోత్సహిస్తున్న కేంద్రం

టీజీఎన్‌పీడీసీఎల్‌, రెడ్‌ కో

సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన

ముందుకొస్తున్న గృహ విద్యుత్‌

వినియోగదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement