కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–17 బాల బాలికల ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీ విజేతలు సిద్దిపేటలో 11, 12, 13 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆదివారం బయలుదేరి వెళ్లినట్టు జిల్లా కార్యదర్శి ఈ.శ్రీధర్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు వీడ్కొలు తెలిపిన వారిలో మాజీ కార్యదర్శి హీరాలాల్, జట్టు కోచ్ గోమతి, పీడీ స్వప్న ఉన్నారు.
ప్రతిపక్షాల
ఆరోపణలు నిరాధారం
సుభాష్‌నగర్: దేశంలో ప్రజాస్వామ్యం ప్ర మాదంలో పడిందంటూ కాంగ్రెస్, ఇతర ప్ర తిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నగరంలోని బీజేపీ కా ర్యాలయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి అంత బాధ ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల త ప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు. రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ప్రమోద్‌కుమార్, నాయకులు లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, న్యాలం రాజు, పురుషోత్తం, ఆమంద్ విజయ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి మి నీ సబ్ జూనియర్ అండర్–13 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సాప్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరై, పోటీలను ప్రారంభించారు. పోటీ ల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని సంజీవిని యూనివర్సిటీ, కోపర్గావ్‌లో జరగనున్న జాతీయ మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఎంఈవో శ్రీనివాస్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగామోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ పరిశీలకుడు పవన్ కు మార్, జిల్లా వాలీబాల్ అ సోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, వీడీసీ ఉపాధ్యక్షుడు ఈర్ల బాలయ్య, ప్రధాన కార్యదర్శి కనక రాజేశ్, కోశాధికారి వేముల నాగరాజు, నల్ల గంగారెడ్డి, ఉత్కం శ్రీనివాస్‌గౌడ్, కొప్పు సుదర్శన్ పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురు కులాల్లో పదో తరగతి చదువుతున్న బాలికలకు ‘ఇస్రో ఎక్స్‌ప్లోరర్ విజిట్’లో భాగంగా ఇస్రోను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల తర్వాత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి, మెరిట్ సాధించిన 50 మంది విద్యార్థినులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎంలు విద్యార్థినులను పరీక్షకు సన్న ద్ధం చేయాలని సూచించారు. వివరాలకు జి ల్లా సైన్స్ అధికారి సిద్ధి రాంరెడ్డి (96979 82888)ని సంప్రదించాలని సూచించారు.


