మద్దతుకు మించి ధర | - | Sakshi
Sakshi News home page

మద్దతుకు మించి ధర

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

బోధన్‌: జిల్లా వ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో సోయా సాగుకాగా, ప్రస్తుతం పంట కోతలు కొనసాగుతు న్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌ సోయాకు మ ద్దతు ధర రూ.5,708 ప్రకటించగా, ప్రైవేట్‌ వ్యాపారులు రూ.6,500 చెల్లిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోయినా.. సోయాకు రికార్డు స్థాయిలో ధర లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.200 వరకు ధర పెరిగే అవకాశం ఉందని ఆశి స్తున్నారు. దీంతో సోయా దిగుబడిని వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. మంజీర, గోదావరి నదుల తీర ప్రాంతమైన బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వర్షాధార మెట్ట భూముల్లో రైతులు సోయా సాగు చేశారు. పొతంగల్‌, కోటగిరి, సాలూర, బోధన్‌, రెంజల్‌ మండలాల పరిధిలో సుమారు 18 వేల ఎకరాల విస్తీరణంలో సోయా సాగైంది. ప్రతి ఏటా ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు చేపడుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటికీ సోయా సేకరణ ప్రారంభించనప్పటికీ రైతులు టెన్షన్‌ పడడం లేదు. పంట కోతలు పూర్తికాగానే ఆరబోసి ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దిగుబడి సైతం పెరగడం రైతులకు కలిసి వచ్చింది.

ఆశాజనకంగా దిగుబడి

ఎకరంలో సోయా సాగుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చుకాగా, ఈ సారి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులంటున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. ఇతర పంటలపై ఎల్‌నినో ప్రభావం చూపుతున్నప్పటికీ మోస్తరు వర్షాలతోనే వర్షాధార మెట్ట భూముల్లో సాగైన సోయా గట్టెక్కింది.

ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి

ఐదు ఎకరాల్లో సోయా సాగు చేశా. నాలుగు రో జుల క్రితం కోత, నూర్పి డి పూర్తయ్యింది. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పు న దిగుబడి వచ్చింది. ఈ సారి సోయా దిగుబడులు ఆశించిన మేరకు ఉన్నాయి. – జంగం గంగాధర్‌, రైతు, సాలూర

మార్కెట్‌లో మంచి ధర

మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.6,500 ధర ఉంది. గతంలో ఇంత ధర ఎప్పుడూ రాలేదు. పంట దిగుబడి మా చేతుల్లో నుంచి వెళ్లిన తర్వాత ధర పెరిగేది. కాని ఈసారి మంచి ధర మా కే దక్కుతోంది. నాకు ఎకరానికి 8 క్వింటాళ్లకు పైగా ది గుబడి వచ్చింది. – సంగెపు భూమయ్య, రైతు, సాలూర

క్వింటాల్‌ సోయాకు ప్రైవేట్‌

వ్యాపారులు చెల్లిస్తోంది రూ.6,500

ప్రభుత్వ మద్దతు ధర రూ.5,708

ఇప్పటికీ ప్రారంభం కాని

కొనుగోలు కేంద్రాలు

ముమ్మరంగా పంట కోతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement