రూ.5 లక్షల భరోసా! | - | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల భరోసా!

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

మత్స్యకారులకు పీఎం మత్స్య సంపద యోజన బీమా

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మత్స్యకారుడు మరణించినా, శాశ్వత వైకల్యం వచ్చినా ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద ప్రమాద బీమా పథకాన్ని అమ లు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కొండంత అండగా నిలుస్తోంది. మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక్కో సభ్యునికి అయ్యే రూ.79.96 వార్షిక ప్రీమియం సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తున్నాయి.

జిల్లాలో 177 సంఘాలు..

జిల్లాలో 177 మత్స్య సహకార సంఘాలున్నాయి. ఇందులో 18 నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న 22,032 మంది మత్స్యకారులకు జిల్లా అధికారులు బీమా చేయించారు. గడిచిన రెండు, మూడేళ్లలో మత్స్య శాఖకు 142 దరఖాస్తులు అందగా, 23 తిరస్కరించారు. అర్హులైన 117 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా డబ్బులు నేరుగా లబ్ధిదారుల (నా మిని) ఖాతాల్లో జమయ్యాయి. ఈ డబ్బుతో బాధి త కుటుంబానికి, పిల్లల భవిష్యత్‌కు భరోసాను లభిస్తోంది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన పత్రాలు అధికారులకు అందజేస్తే.. వారు ఆరు నెలల్లోపు బీమాను సెటిల్‌ చేస్తున్నారు.

మరణించినా, శాశ్వత వైకల్యం వచ్చినా ఇన్సురెన్స్‌ ద్వారా ఆర్థిక మద్దతు

ప్రీమియం భారం పూర్తిగా ప్రభుత్వానిదే..

ఇప్పటికే జిల్లాలో లబ్ధిపొందిన

117 కుటుంబాలు

ప్రభుత్వం అందించే సహాయం ఇలా..

ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు

శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.5లక్షలు

పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.2.50లక్షలు

గాయపడితే (వైద్య ఖర్చులకు) రూ.25వేలు

ప్రతి సభ్యుడికి బీమా చేయించాం

జిల్లాలో మత్స్యకార సహకార సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యుడిని బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. జలాశయాలు, చెరువుల్లో వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదాల బారిన పడితే వారి కుటుంబా లు రోడ్డున పడకుండా ఉచిత ప్రమాద బీమా పథ కం అండగా నిలుస్తుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలు ఎలాంటి దళారులను ఆశ్రయించకుండా నేరుగా జిల్లా మత్స్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి.

– నాగులు, జిల్లా మత్స్య శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement