బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గోపన్పల్లి శివా రు, ఐటీఐ కళాశాల ప్రాంగణంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన ఇద్ద రు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రవికుమార్, ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. కొన్ని నెలల క్రితం బిచ్కుంద పీఎస్ పరిధిలోని ఆయా గ్రామాల శివారులలో 19 ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం కేసులో వి ద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఫత్లాపూర్ దాబా హోటల్ వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని పట్టుకొని విచారించామన్నారు. నిందితులు జరిగిన ఘ టనల్లో నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు మహారాష్ట్ర పర్భాని జిల్లాకు చెందిన సత్నామ్సింగ్, చందుసింగ్ విచారణలో తేలింది. నిందితులను అ రెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.


