బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులోని లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపును ఆలయంలో ఆదివారం నిర్వహించారు. దేవాదాయ శాఖ జిల్లా పరిశీలకురాలు సుజాత రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చిలుక రవి, ఆలయ ఈవో గింజుపల్లి వేణు సమక్షంలో హుండీ ఆదాయం డబ్బుల లెక్కింపు కొనసాగింది. ఆలయ ఈవో వేణు వివరాలను వెల్లడించారు. దైవ దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.24,400, వ్యాపార దుకాణాల నిర్వహణనకు సంబంధించి వేలం ద్వారా రూ.లక్షా 12,100, హుండీ డబ్బులు రూ. 60,113 మొత్తం రూ.లక్షా 96 వేల 613 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఆలయ కమిటీ సభ్యులు నర్సారెడ్డి, మోహన్, సంజయ్, గంగాధర్, రాజు, అర్చకులు శ్రీరంగం కొండమాచార్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు రైతులతో సీఎంముఖాముఖి చర్చ
బోధన్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యా సంగి సీజన్ పంట సాగు అంశాలపై సోమ వారం ఉదయం 10 గంటలకు ఎడపల్లి రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ము ఖా ముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొనున్నా రని ఎడపల్లి ఏవో సిద్దిరామేశ్వర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. రాబోయే యాసంగి సీజ న్‌లో అనుకూలమైన పంటల ఎంపిక, సాగు ప్రణాళిక రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారని తెలిపారు.
వర్ని: మోస్రా మండలంలో ఎలుగుబంటి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. శనివారం రాత్రి మోస్రా నుంచి చింతకుంట వెళ్తున్న వ్యక్తులకు ఎలుగుబంటి కనిపించిందని అధికారులు తెలిపారు. రాత్రి, తెల్లవారుజామున ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లో సంచరించరాదని అత్యవసర పని ఉంటే గుంపులు గుంపులుగా వెళ్లాలన్నారు. ఎలుగుబంటిని చూడటానికి దగ్గరగా వెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతాల్లో జంతువుల సంచారం ఇటీవల పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా చాత్తాద వైష్ణవ
సంఘం ఎన్నికలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నగరంతో పాటు జిల్లాలోని ఆర్మూర్, భీంగల్, బోధన్ పట్టణాలలో వివిధ మండలాలు, గ్రామాల నుంచి వైష్ణవ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం ఓట్లు 1,368 ఉండగా 685 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.


