కామారెడ్డి టౌన్: కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో ఎకై ్సజ్ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం భా రీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు రూ.9 లక్ష ల విలువైన 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకోవడంతోపాటు రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి వెల్లడించారు. ద సరా పండుగను పురస్కరించుకొని మాదకద్రవ్యాల కట్టడిలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసులు, ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా స్టేషన్‌లో నిఘా పెట్టారు. తనిఖీల సమయంలో ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా తిరుగు తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువ కుడిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా, 18 కిలో ల ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఒడిశా నుంచి మహారాష్ట్ర..
నిందితుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినికి చెందిన అశోక్‌గా గుర్తించారు. ఒడిశాలోని టిట్లాగఢ్ నుంచి నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్‌లో కానిస్టేబుళ్లు అమృత్‌రెడ్డి, శిరీష, రాజు పాల్గొన్నారు. శ్రీఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2523 లేదా స్థానిక ఎకై ్సజ్ అధికారులకు సమాచారం అందించాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కోరారు.
రూ.9 లక్షల విలువజేసే 18 కిలోల
ఎండు గంజాయి స్వాధీనం
నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ అధికారి ముకుందరెడ్డి


