దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం | - | Sakshi
Sakshi News home page

దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం

Oct 11 2026 1:10 PM | Updated on Oct 11 2026 1:10 PM

దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం చెట్లు నరికిన వ్యక్తికి జరిమానా మహిళ అదృశ్యం

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సొన్న లింగం(40) ఇటీవల దుబాయిలో గుండెపోటుతో మరణించగా మృతదేహం శనివారం ఇంటికి చేరింది. కొన్నేళ్లుగా లింగం ఉపాధికోసం దుబాయికి వెళ్లివస్తున్నాడు. మంగళవారం అతడు గుండెపోటుకు గురై మరణించినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబీకులు, బంధువుల అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి పరిధిలోగల హైవే పక్కన ఉన్న ఓ దాబా వద్ద అక్రమంగా దాచిన 0.194 టన్నుల వంట చెరుకును స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్‌భట్‌ శనివారం తెలిపారు. రోడ్డు పక్కన నాటిన నాలుగు ఎవెన్యు ప్లాంటేషన్‌ చెట్లను వర్ని గ్రామానికి చెందిన షేక్‌ మజీద్‌ అనే వ్యక్తి కొట్టివేసి సమకూర్చుకున్నట్లు తెలిపారు. దీంతో చెట్లను కొట్టిన మజీద్‌కు రూ.7వేల జరిమానా విధించామన్నారు. వంట చెరుకును పట్టుకున్న సెక్షన్‌ అధికారి ప్రభాకర్‌, బీట్‌ అధికారి వందనను ఎఫ్‌ఆర్‌వో అభినందించారు.

వర్ని: చందూరు మండల కేంద్రానికి చెందిన గజ్జి సైదవ్వ (50) అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 7న నవీపేట్‌ మండలంలోని పలుగుట్టకు వెళ్లిన సదరు మహిళ ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం ఆమె భర్త నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement