● భూగర్భ జలాలు పడిపోయే
అవకాశం ఉంది
● రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలి
● అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు శుక్రవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో వీబీ జీ రామ్‌జీ ప నులకు పెద్ద ఎత్తున కూలీలు వస్తున్నందున దీర్ఘకా లంలో ఉపయోగపడే పనులను చేపట్టాలన్నారు. తెలంగాణకు జలసిరి కార్యక్రమంలో భాగంగా పంట కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం పెద్ద ఎత్తు న చేపట్టి జల సంరక్షణకు కృషి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపాతం, ఇతర శాఖల సమగ్ర వివరాలను నిర్దేశిత సమయంలోగా అందజేయాలని ఆదేశించారు. వీసీ అనంత రం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాభావం వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా లేకపోవడంతోపాటు భూగర్భజలాలు కూడా పడిపోయే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగు చేస్తే ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున క్షేత్రస్థాయిలో రైతులకు వాస్తవ పరిస్థితి వివరించాలన్నారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్‌వో గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


