దసరాకు అదనపు బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు అదనపు బస్సులు

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

● ఆయా రూట్లలో ప్రయాణికులను

చేరవేయనున్న 719 సర్వీసులు

● ఈనెల 26వ తేదీ వరకు బస్సులు

నడపాలని నిర్ణయం

నిజామాబాద్‌ రూరల్‌: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రీజియన్‌ పరిధిలో ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు ఆయా రూట్‌లలో అదనంగా 719 బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌వీజీ కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నిజామాబాద్‌ డిపో –1, 2, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, కామారెడ్డి డిపోల ద్వారా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జేబీఎస్‌ (జూబ్లీ బస్‌ స్టేషన్‌) వద్ద ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను, సిబ్బందిని విధుల్లో నియమమించినట్లు తెలిపారు. బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తూ, ప్రయాణికులకు సరైన సమాచారం అందించడం, బస్సులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడడం, రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆర్‌ఎం కోరారు. ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. ఆన్‌లైన్‌లోనూ టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement