దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

బోధన్‌టౌన్‌: బోధన్‌ పట్టణ పరిధిలో నూతన బార్‌ ఏర్పాటుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్‌ సీఐ ప్రభాకర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 12 వ తేదీ వరకు పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా కార్యాలయంలో అందించాలన్నారు. ఈ నెల 16న జిల్లా ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో లక్కీ డ్రా ఉంటుందని అన్నారు.

సిరికొండ: రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు సిరికొండలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని దేవి విజ్ఞ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ రాజేశ్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో ఈ నెల 9న నిర్వహించే అండర్‌–19 విభాగం పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందని అన్నారు. విద్యార్థినిని కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్‌ అభినందించా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలకు..

మాక్లూర్‌: రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్‌ పోటీ లకు మండలంలోని మహాత్మ జ్యోతీబా ఫూలే బాలికల పాఠశాలకు చెందిన నలుగురు విద్యా ర్థినులు రిషిప్రియ, ప్రతిభ, స్పందన, భవిత ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి మర్యాల స్వప్న తెలిపారు. అనంతరం విద్యార్థులను ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement