ఏఈవో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఏఈవో ఆత్మహత్య

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

రాజంపేట(భిక్కనూరు): మండల కేంద్రంలో ఏఈవోగా పనిచేస్తున్న సావసాని శ్యాంసుందర్‌రెడ్డి(48) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్యాంసుందర్‌రెడ్డి స్వగ్రామం రాజంపేట మండలం తలమడ్ల. ఆయన రాజంపేట ఏఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి తలమడ్ల శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి కృష్ణారెడ్డి పొలానికి వెళ్లి చూడగా రేకుల షెడ్డులో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై భువనేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కుమారుడు నిహాంశ్‌రెడ్డి, కూతురు నిహారిక ఉన్నారు. స్విట్జర్లాండ్‌ ఉంటున్న సోదరి గురువారం వస్తారని, ఆమె వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అనారోగ్య సమస్యలతో మహిళ..

బోధన్‌: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎడపల్లి ఎస్సై రమ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన మహెర్‌ ఉన్సీసాబేగం(54) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఎడపల్లి మండలం జానకంపేట శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement