అడవి పందులు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అడవి పందులు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

నందిపేట్‌: అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెల్మల్‌ ప్రాంతంలో కొందరు బుధవారం అడవి పందులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడి చేసి పట్టుకున్నట్లు అటవీశాఖ అధికా రులు తెలిపారు. వాహన డ్రైవర్‌ విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా భైంసా ప్రాంతం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని జంగారె డ్డి గూడెనాకి తరలిస్తున్నట్లు వెల్లడించాడు. నిందితు డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అనంతరం అడవిపందులను సమీపంలోని రిజర్వు ఫారెస్టులో విడిచిపెట్టారు. ఎవరైనా వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారి అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. డిప్యుటీ రేంజ్‌ అధికారి సుధాకర్‌, నందిపేట ఫారెస్టు బీట్‌ అధికారి లింబాద్రి, సిబ్బంది మాధవి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement