● ఆర్మూర్‌లో సందడి చేసిన
సినీ నటి శ్రీముఖి
● తరలివచ్చిన అభిమానులు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ‘ది చైన్నె షాపింగ్ మాల్’ 37వ బ్రాంచ్‌ను సినీ నటి శ్రీముఖి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడిరాకేశ్‌రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. నటి శ్రీముఖి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఆర్మూర్ బిడ్డనే అని, ఆర్మూర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రజలకు ఆధునిక మోడల్స్, నాణ్యమైన వస్త్రాలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. మాల్ లోని వివిధ విభాగాలను సందర్శించి నూతన వస్త్ర శ్రేణులు, డిజైన్లను పరిశీలించారు. శ్రీముఖి ని చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కానుక గా లక్షలాది సరికొత్త డిజైన్లు, అదిరిపోయే ఆఫర్ల తో మాల్ అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. అలాగే షాపింగ్ మాల్‌ను సందర్శించి ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లహరిరఘు, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, షాషింగ్‌మాల్ యాజమనులు తదితరులు పాల్గొన్నారు.


