● ప్రముఖ జాతీయ సంస్థల్లో
ఇంటర్న్‌షిప్ సదుపాయం
● ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో
ఉద్యోగావకాశాలు
భిక్కనూరు:ప్రస్తుత డిజిటల్ యుగంలో అత్యంత వే గంగా వృద్ధి చెందుతున్న, ఉజ్వలమైన భవిష్యత్తు ఉ న్న అద్భుతమైన రంగం జియో ఇన్ఫర్మాటిక్స్. ఈ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వ,ప్రయివేటు రంగాల్లో ఉద్యోగావకాశాలతోపాటు, పలు సంస్థల్లో ఇంటర్న్‌షిప్ సదుపాయాలు కూడా ఉంటున్నాయి. ఆధునిక సాంకేతికతతో ముడిపడి ఉన్న ఈ రంగం విద్యార్థులకు, నిపుణులకు భారీగా ఉపాధి అవకా శాలను అందిస్తోంది.
తెయూలో అందుబాటులో..
భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, భద్రపరచడం ఈ శాస్త్రం ముఖ్య ఉద్దేశం. ఇందులో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(జీఐఎస్), గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), రిమోట్ సెన్సింగ్ డ్రోన్ సర్వేయింగ్ లాంటి అధునాతన టెక్నాలజీలు ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ ఏవిధంగా పనిచేస్తుందో అదే టెక్నాలజీని అన్ని రంగాలకు వర్తింపజేయడమే ఈ కోర్సు ఉద్దేశం. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉండగా కేవ లం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, ఉ స్మానియా యూనివర్సిటీలో ఈ సౌకర్యం ఉంది.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
● జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్సుతో భూగోళ శాస్త్రం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ రెండు నేర్చుకుంటారు.
● కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హత ఉంటుంది.
● సీఎస్ఈ, ఈసీఈ లాంటి కోర్సుల్లో పోటీ ఎక్కువ.. కానీ జియో ఇన్ఫర్మాటిక్స్ నిపుణులకు దేశంలో తీవ్ర కొరత ఉంది.
● నాసా,ఇస్రో,గూగుల్,మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో ఈ కోర్సు వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది.
● సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లు, మున్సిపల్, పంచాయతీరాజ్ భూ రికార్డు ల శాఖ, వ్యవసాయ, అటవీ, జల వనరుల శాఖ ల్లో జీఐఎస్ ఎక్స్పర్ట్ ఉద్యోగావకాశాలుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంతోపాటు వ్యవసాయ టెక్ కంపెనీల్లో కూడా ఈ కోర్సు చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.
● ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ తర్వాత బీఎస్సీ, బీటెక్‌లో జియో ఇన్ఫర్మాటిక్స్, డిగ్రీ తర్వాత ఎంఎస్సీ, ఎంటెక్ చేయడం ద్వారా మరింత ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చు.


