ఆర్మూర్‌టౌన్: బీజేపీ బీసీలకు రాజకీయాల్లో పెద్ద పీట వేస్తోందని, ఆ ఘనత ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డికి దక్కుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూర్‌కాపు సంఘంలో యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో గల్ఫ్కార్మికలు సమస్యలను పరిష్కరించాలని మాట్లాడిన ఏకై క ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. అనంతరం కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి కుమార్ మాట్లాడారు.పలువురిని సత్కరించారు. బీజేపీ కౌన్సిలర్లు యమాద్రి భాస్కర్, పాన్ శ్రీనివాస్, శ్రావణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


