విశాఖ, ఒడిశా.. వయా నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖ, ఒడిశా.. వయా నిజామాబాద్‌

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రం మీదుగా గంజాయి అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి గంజాయిని కొన్ని ముఠాలు జిల్లాను ప్రధాన కేంద్రంగా చేసుకొని మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచినా, గంజాయి భారీగా పట్టుబడుతున్నా అక్రమ రవాణా ఆగడం లేదు.

వేరే వ్యక్తులకు డబ్బులిచ్చి..

ఒడిశా, బిహార్‌కు చెందిన అనేక ముఠాలు గంజాయిని మూటలు కట్టి, కొందరు వ్యక్తులను ఎంచుకొని, వారికి డబ్బులు ఇచ్చి రైలు, రోడ్డు మార్గాల ద్వారా నిజామాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌, జాల్న ఇతర ముఖ్యమైన ప్రాంతాలతోపాటు ముంబై వరకు తరలిస్తున్నారు. అనంతరం ఫలానా వ్యక్తికి ఫలానా వాహనంలో పెట్టి రావాలని సూచిస్తున్నారు. ఈనెల 20న విశ్వసనీయ సమాచారం మేరకు రైల్లో ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరఫరా చేసిన వ్యక్తి తప్పించుకోగా నిజామాబాద్‌ ఎకై ్సజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

● ఆగస్టు 21న ఇద్దరు వ్యక్తులు షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో 24.3 కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు.

● గత నెల 12న (సంబల్పూర్‌–నాందేడ్‌) నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న 5.1 కేజీల గంజాయిని ఎకై ్సజ్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా.. రూ.పది వేలు ఇవ్వడంతో సరఫరా చేసినట్లు తెలిపారు.

● జూన్‌లో (సంబల్పూర్‌–నాందేడ్‌) నాగావళి ఎక్స్‌ ప్రెస్‌లో 5.37 కేజీల గంజాయిని ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన ఓ ముఠా గంజాయిని విశాఖపట్నం నుంచి నాందేడ్‌కు తీసుకొస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు.

తనిఖీలు నామమాత్రం..

ప్రధానంగా గంజాయి రవాణా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్యే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనిఖీలు లేకపోవడంతో జిల్లా ను దాటే క్రమంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నా రు. గంజాయి రవాణాతోపాటు దొంగతనం చేసి మహారాష్ట్రకు తేలికగా పారిపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చెక్‌పోస్టులు ఏర్పా టు చేస్తే అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉందని పలువురు కోరుతున్నారు.

సంవత్సరం గంజాయి అల్ప్రాజోలం నమోదైన అరెస్టులు

(కిలోల్లో..) (కిలోల్లో..) కేసులు

2024 41.202 3.6423 55

2025 15.64 35.9690 211

2026 75.4 20.2387 68

(సెప్టెంబర్‌ 20 వరకు)

మూడేళ్ల కేసుల వివరాలు

జిల్లా కేంద్రం మీదుగా గంజాయి

అక్రమ రవాణా

ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు

సరఫరా చేస్తున్న ముఠాలు

పోలీసులకు పట్టుబడుతున్నా

ఆగని దందా

గంజాయి అక్రమ రవాణాకు జిల్లా కేంద్రం ప్రధాన అడ్డాగా తయారైంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు సరఫరా కొనసాగుతుంది.

పోలీసులకు నిందితులు పట్టుబడ్డా, నిఘా పెంచినా దందా మాత్రం ఆగడం లేదు.

ప్రత్యేక దృష్టిసారించాం..

రైల్వే స్టేషన్‌లో తనిఖీలు పకడ్బందీగా చేపడుతున్నాం. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఇది వరకే పలు కేసులు నమోదు చేశాం. అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం.

– సాయిరెడ్డి, రైల్వే ఎస్సై, నిజామాబాద్‌

కఠిన చర్యలు తీసుకుంటాం

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గంజాయి ముఠాలను పట్టుకుంటాం. గంజా యి అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటాం. – సరిత, ఎకై ్సజ్‌ సీఐ, నిజామాబాద్‌ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement