జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగ తి చదువుతున్న ఏ మ ధుమిత జాతీయ స్థాయి సబ్‌ జూనియ ర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పి సాయన్న, పీడీ నాగభూషణం సోమవారం తెలిపారు. ఇటీవల కమ్మర్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న మధుమిత ఉత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం సాధించిందన్నారు. అలాగే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ శిబి రంలో ప్రతిభకనబర్చి జాతీయ స్థాయి జట్టు కు ఎంపికై నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే 39వ సబ్‌ జూనియర్‌ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున మధుమిత పాల్గొననున్నదని పేర్కొన్నారు. మధుమిత ఎంపికపై సర్పంచ్‌ కొత్తపల్లి హారిక, వీడీసీ అధ్యక్షుడు మల్యాల సుభాష్‌గౌడ్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

బార్‌ ఏర్పాటుకు

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో మరో నూత న బార్‌ ఏర్పాటుకు ఎకై ్సజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, ము న్సిపల్‌ పరిధి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన బార్‌ల ఏర్పాటుకు ఎకై ్సజ్‌ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బోధన్‌ పట్టణంలో నూతన బార్‌ ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2బీ బార్‌ ఏర్పాటు కోసం అక్టోబర్‌ 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ , 16న కలెక్టర్‌ కార్యాలయంలో లక్కీడ్రా నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.లక్షగా నిర్ణయించారు. ఇదివరకే జిల్లాలో 22 బార్‌లు ఉండగా, నూతనంగా ఏర్పాటు చేయనున్నదానితో కలిపి బార్‌ల సంఖ్య 23కు చేరనుంది.

అర్వింద్‌ ఎంపీగా

గెలవడం దురదృష్టకరం

నిజామాబాద్‌ అర్బన్‌: ఎంపీగా ధర్మపురి అ ర్వింద్‌ గెలువడం జిల్లా ప్రజల దురదృష్టమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అహంకారం, అవినీతి, అబద్దానికి అర్వింద్‌ నిదర్శనమని విమర్శించారు. తన తండ్రి హయాంలో కాంగ్రెస్‌ బీ ఫారాలను అమ్ముకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని పగలుతిడుతూ, రాత్రి బతిమిలాడుకునే నైజం అరవింద్‌ది అని అన్నారు. కేసీఆర్‌ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి అబద్దాలు చెప్పాడో అరవింద్‌ కూడా అవే అబద్దాలు చెప్పారన్నారు. జిల్లా పసుపురైతులను అర్వింద్‌ నిండా ముంచాడని విమర్శించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, సత్యప్రకాశ్‌, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement