ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

సుభాష్‌నగర్‌: ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, తమ అనుకూల ఓటరు జాబితాతో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సర్‌ ప్రక్రియలోభాగంగా రాష్ట్రంలో దాదాపు 90 లక్షలకుపైగా మంది తమ ఓట్లు కోల్పోయే ఆస్కారముందని ఆందో ళన వ్యక్తంచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞా నేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదు ట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్‌ భవన్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ ఎదుట జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఓట్‌ చోరీపై రాహు ల్‌గాంధీ పార్లమెంట్‌లో గళమెత్తుతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు ఉన్నాయో.. లేదో తెలుసుకోవాలన్నా రు. వెంటనే సీఈసీ జ్ఞానే్‌శ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి తొ త్తుగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించగా, ధర్నా అనంతరం కలెక్టర్‌ భవేశ్‌మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.

డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, తాహెర్‌ బిన్‌ హందాన్‌, బాడ్సి శేఖర్‌గౌడ్‌, కవితారెడ్డి, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌, మాజీ చైర్మన్లు ఈరవత్రి అనిల్‌, అన్వేష్‌రెడ్డి, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి, నుడా చైర్మన్‌ కేశ వేణు, బాల్గొండ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి, కుంట రమేష్‌రెడ్డి, తారాచంద్‌, టీపీసీసీ ప్రతినిధులు రాంభూపాల్‌, రామకృష్ణ, సీనియర్‌ నాయకులు జా విద్‌ అక్రమ్‌, మీసాల సుధాకర్‌, ముప్ప గంగారెడ్డి, నరాల రత్నాకర్‌, గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి, మునిపల్లి చిన్న సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనుకూల ఓట్లతో బీజేపీ

ప్రభుత్వాల ఏర్పాటు

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తక్షణమే

బర్తరఫ్‌ చేయాలి

ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సీఈసీ

దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement