ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ ఏర్పాట్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆరు లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించామని, తదనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులను కలె క్టర్‌ ఆదేశించారు. సకాలంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే పూర్తి చేయాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గిడ్డంగులు, ఫంక్షన్‌ హాళ్లు, ఆయా ప్రదేశాలను క్షేత్రస్థాయిలో గుర్తించినట్లు తెలిపారు. డిఫా ల్ట్‌ జాబితాలో లేని రైస్‌ మిల్లులకు ధాన్యం కేటా యించేలా ప్రభుత్వం తాజాగా అనుమతించిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన 7 రకాల సన్నాలను పక్కాగా గుర్తించేలా సంబంధిత అధికారులకు, వలంటీర్లకు తగిన శిక్షణ అందించాలని అన్నారు. డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం ప్రవీణ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి డీసీవో శ్రీనివాస్‌రావు మార్కెటింగ్‌ శాఖ అధికారిణి గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భద్రతకు..

నిజామాబాద్‌ అర్బన్‌: పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు/కళాశాలలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ కూడా కలుషిత ఆహారం, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement