నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని ఉమ్మెడ బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం రెండో రోజు శనివారం కొనసాగింది. జి ల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఎనిమిది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరి నదికి తరలించారు. అక్కడ బ్రిడ్జి పైనుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో విగ్రహాలను నదిలో నిమజ్జనం చేశారు. ఉమ్మెడ బ్రిడ్జి వద్ద వివిధ శాఖల అఽధికారులు నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నది బ్రిడ్జిపై శనివారం కొనసాగిన గణేశ్ విగ్రహ నిమజ్జనాలను సీపీ సాయి చైతన్య పర్యవేక్షించారు. బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బందికి సూచనలు చేశారు. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి విగ్రహాలు రావడంతో ఏర్పాట్లను ఇంకా కొనసాగించాలని సూచించారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, నార్త్‌రూరల్ సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


