సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

ఆర్మూర్‌: మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పసుపు పంటలో తెగుళ్లను నివారించవచ్చని కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త విద్య సూచించారు. ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి శివారులోని నూతుల శ్రీనివాస్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పసుపు పంటను బుధవారం ఆమె పరిశీలించారు. జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్‌, ఆర్మూర్‌ డివిజన్‌ ఉద్యాన అధికారి సంధ్య, హెచ్‌ఈవో శశిరాజ్‌తో క్షేత్ర పర్యటన నిర్వహించారు. దుంప కుళ్లు, మర్రి ఆకు తెగులు, ఆకు మచ్చ తెగులు సస్యరక్షణ చర్యలపై ఆమె రైతులకు వివరించారు. విత్తన శుద్ధి, బెడ్‌ పద్ధతి, బిందు సేద్యం ద్వారా చీడపీడలను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు. మొక్క ఎదుగుదల, దుంప పెరుగుదలకు ఎరువుల సిఫారసులను చేశారు. దుంప ఈగ, దుంప కుళ్లు కోసం వేప పిండి, ట్రైకోడెర్మా కలిపిన మిశ్రమాన్ని చల్లుకోవాలన్నారు. రిడామిల్‌ ఏంజెడ్‌తో సాయిల్‌ డ్రెంచింగ్‌ చేసుకోవాలని సూచించారు. తోటలో నీరు ఆగకుండా చూసుకోవాలని సూచించారు. వారి వెంట రైతులు, ఉద్యాన శాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement