సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

బోధన్‌ రూరల్‌: బోధన్‌ డివిజన్‌ పరిధిలోని భవానీపేట్‌లో ఏర్పాటు చేసిన రెండు మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్‌ను విద్యుత్‌ గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు తెలిపారు. గ్రామంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసిన రైతు సతీశ్‌ కృష్ణ గోపిశెట్టి పొలంలో ఎస్‌ఈ సాంకేతికంగా ప్లాంట్‌ను చార్జ్‌ చేశారు. ఎస్‌ఈ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పీఎం–కుసుమ్‌–ఏ పథకం ద్వారా రైతులను సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఈ వెంకటరమణ, డీఈఈ ముక్తార్‌ మహమ్మద్‌, ఏడీఈలు నగేశ్‌కుమార్‌, బాలచందర్‌, ఏఈ మారుతి, డీసీ రాజు, సురేశ్‌బాబు, గ్రామ పెద్దలు, విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement