తెయూ సమాచారం | - | Sakshi
Sakshi News home page

తెయూ సమాచారం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

విద్యార్థులు లక్ష్యాన్ని

నిర్దేశించుకోవాలి

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని తెయూ ఉపాధ్యాయ సంఘం(టూటా) అధ్యక్షుడు పున్నయ్య అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ‘వాల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌– మై డ్రీమ్‌ – మై ఎడ్యుకేషన్‌ – మై ఫ్యూచర్‌’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు, సామాజిక బాధ్యతే వికసిత భారత్‌–2047 లక్ష్య సాధనకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కలలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలు, వినూత్న ఆలోచనలను రంగురంగుల కాగితాలపై రాసి ‘వాల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’పై అతికించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ప్రోగ్రాం ఆఫీసర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌, విద్యార్థులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెయూ టీచర్స్‌ అసోసియేషన్‌ (టూటా) అధ్యక్షుడు పున్నయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఏయూటీఏ) పిలుపుమేరకు బుధవారం టూటా ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరిలకు వినతిపత్రాలు అందజేశారు. నాయకులు నాగరాజు, నీలిమ, పాత నాగరాజు, లక్ష్మణ చక్రవర్తి, బాలకిషన్‌, మహేందర్‌ రెడ్డి, డీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెయూలో ‘కిల్‌ ద క్యాన్సర్‌’ వక్తృత్వ పోటీలు

తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో, ఇస్కాన్‌ సహకారంతో ‘కిల్‌ ద క్యాన్సర్‌’ వక్తృత్వ పోటీ 2026 వర్సిటీ స్థాయి సెమిఫైనల్స్‌ బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ అపర్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీలో వర్సిటీ పరిధిలోని 25 కళాశాలల నుంచి 65 మంది విద్యార్థులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం న్యాయనిర్ణేతలు విద్యార్థుల ప్రతిభను వివిధ ప్రమాణాల ఆధారంగా పరిశీలించి, తదుపరి విశ్వవిద్యాలయ స్థాయి ఫైనల్స్‌కు 10 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో పోటీల కన్వీనర్‌ ఎన్‌ స్వామి, ఇస్కాన్‌ ప్రతినిధులు, వర్సిటీ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

తెయూ(డిచ్‌పల్లి): ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెయూ మెయిన్‌ క్యాంపస్‌ లోని మూడు హాస్టల్స్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్‌ వీసీ, రిజిస్ట్రార్‌ లకు వినతిపత్రాలను అందజేశారు. స్పందించిన వీసీ ప్రభుత్వం ద్వారా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెరిగే విధంగా తగిన చొరవ చూపుతామన్నారు. హాస్టల్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్‌, ఇతర ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement