బాన్సువాడ : వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్లను చోరీ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు బీర్కూర్ ఎస్సై రాములు తెలిపారు. బీర్కూర్ మండలం వీరాపూర్ శివారులో 21 బోర్ల వద్ద గల కేబుల్ వైర్లు కట్ చేసి దొంగిలించుకుపోయినట్లు రైతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈకేసు విషయంలో గ్రామంలోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వైర్లు చోరీ చేసింది తామే అని అంగీకరించారన్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై పేర్కొన్నారు.


