భక్తులకు బంపర్‌ ఆఫర్లు! | - | Sakshi
Sakshi News home page

భక్తులకు బంపర్‌ ఆఫర్లు!

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వీధివిధినా విభిన్నరూపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులను మరింతగా ఆకట్టుకునేందుకు, మండలపాల వద్ద రద్దీని పెంచేందుకు గణేశ్‌ ఉత్సవ కమిటీల నిర్వాహకులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఆధ్యాత్మికతతోపాటు వినోదాన్ని జోడిస్తూ... లక్కీ కూపన్లు, బంపర్‌ డ్రాలు నిర్వహిస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించడానికి ‘ఇరుముడి’వంటి ఆధ్యాత్మిక చిత్రాలను, కళా నృత్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.

డొంకేశ్వర్‌ మండపాల వద్ద..

డొంకేశ్వర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం వద్ద ఏకంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘బుల్లెట్‌ బైక్‌’ను లక్కీ డ్రా బహుమతిగా పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్‌ను గెలుచుకోవడానికి యువత, భక్తులు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చేస్తున్నారు. మరో గణపతి మండపం వద్ద పర్యావరణ పరిరక్షణను చాటి చెప్పేలా వినూత్నంగా రెండు చార్జింగ్‌ స్కూటీలతోపాటు ఒక సైకిల్‌ను లక్కీ డ్రా బహుమతులుగా ప్రకటించి భక్తులను ఆకర్షిస్తున్నారు. ఇతర గ్రామాల్లో సైతం గణేశ్‌ కమిటీలు పోటాపోటీగా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నాయి. ఎల్‌ఈడీ టీవీలు, మిక్సీలతోపాటు విలువైన బంగారు, వెండి నాణేలను సైతం బహుమతులుగా పెట్టారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో యూరియా బస్తాలను సైతం లక్కీ డ్రాలో పెట్టారు.

వినాయక మండపాల వద్ద

లక్కీ డ్రాల సందడి

ఆధ్యాత్మికతకు వినూత్న

కార్యక్రమాలు జోడింపు

బుల్లెట్‌ బైక్‌ నుంచి చార్జింగ్‌

స్కూటర్లు, సైకిళ్ల వరకు బహుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement