రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రానికి చెందిన జంగం ప్రదీప్ నాగలింగప్ప స్వామికి మ హారాష్ట్ర రాష్ట్రస్థాయి వేదశాస్త్రి పురస్కారం లభించింది. మహారాష్ట్రలోని సోలాపూర్ శివ యోగి సిద్ధ రామేశ్వర వైదిక పాఠశాలలో వేద అధ్యాపకులుగా సేవలందిస్తున్న ఆయనను ఆదివారం నాందేడ్‌లో ఘనంగా సత్కరించా రు. ప్రదీప్ జంగం స్వామి వేద విద్యను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పలువురు విద్యార్థులకు వేదాధ్యయనంలో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వేదశాస్త్ర రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మహా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసింది.
గ్రామస్తుల హర్షం
పొతంగల్‌కు చెందిన వ్యక్తికి రాష్ట్రస్థాయి వేదశాస్త్రి పురస్కారం లభించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రదీప్ జంగం స్వామికి అభినందనలు తెలిపారు. ఆయనకు లభించిన ఈ గౌరవం పోతంగల్ గ్రామానికి ప్రత్యేక గు ర్తింపును తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి సైదు వరుణ్‌తేజ్ సీబీఎస్‌ఈ రుక్మాపూర్ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యా రు. కరీంనగర్‌లోని రుక్మాపూర్‌లో ఉన్న సైనిక్ పాఠశాలకు తమ కుమారుడు 8వ తరగతిలో ప్రవేశం కోసం ఎంపికై నట్లు విద్యార్థి తండ్రి రా ము తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన ట్లు ఆయన పేర్కొన్నారు. వరుణ్‌తేజ్‌ను సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ లోక పురుషోత్తంరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ చైర్మన్ అంకం రాజేందర్, సభ్యులు అభినందించారు.
డిచ్‌పల్లి: ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా, చర్చను అడ్డుకోవడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేయడమే అవుతుందని బీఆర్‌ఎస్ నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు. 22/ఏ సమస్య, విద్యుత్ సంక్షోభం, యూరియా కొరత, జీవో 97పై సమీక్ష వంటి అంశాలు నేరుగా ప్రజలు, రైతులు, విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, వాటిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం సుమారు రూ. వెయ్యి కోట్ల అప్పు తీసుకున్నారని వస్తున్న ఆరోపణలపై సీఎం ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్యం రెడ్డి, శ్రీనివాస్‌రావు, భూమయ్య, సాయారెడ్డి, గోకుల్ సింగ్, తిరుమల్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
కామారెడ్డి అర్బన్: మున్నూరుకాపులు సమాజాభివృద్ధిలో చురుకుగా పాల్గొనాలని మున్నూరుకాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నర్సింలు అన్నారు. ఆదివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా ఎన్నికై న రామారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం కార్యవర్గసభ్యులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. సంఘం రామారెడ్డి మండల అధ్యక్షుడు ల్యాగల మహిపాల్, ప్రధాన కార్యదర్శి బండి లింగం, గౌరవ అధ్యక్షుడు చెన్నంశెట్టి రమేష్, ప్రతినిధులు భైరయ్య, సాయికుమార్, జిల్లా ప్రతినిధులు రావుల గంగాధర్, ముల్కరాజు తదితరులున్నారు.
లక్ష్మీదేవునిపల్లి యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక
భిక్కనూరు: మండలంలోని లక్ష్మిదేవునిపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆత్మకూరి అనిల్‌రెడ్డి, ఉపాధ్యాక్షుడిగా మాగిని రమేష్, పుల్లురి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట శ్రీకాంత్, సహాయకార్యదర్శులుగా మాగిని నరేష్, ప్రశాంత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆలకుంట మహేశ్, సలహాదారులుగా ఏనుగు మాదవ్‌రెడ్డి, ఎన్గు శ్రీనివాస్‌రెడ్డి, లింబారెడ్డి, రామ్‌రెడ్డి, నాగిరెడ్డి,మైపాల్‌రెడ్డి, రమేష్, ఎల్లం, నర్సింలు, భూమయ్యలు పాల్గొన్నారు.


