● సివిల్ పెన్షనర్స్ ధర్నా
నిజామాబాద్ రూరల్ : పే రివిజన్, పెన్షన్ రివిజన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగరంలోని గాంధీ చౌక్‌లో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా పోస్టల్ అండ్ ఆర్‌ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిదో వేతన సవరణ సంఘం టర్‌మ్స్ ఆఫ్ రికార్డ్స్‌లో పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ లేకపోవడాన్ని తప్పుబట్టారు. పెన్షన్ కమ్యూనికేషన్ 10 సంవత్సరాల 8 నెలలకే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా పెన్షనర్స్ జనరల్ సెక్రెటరీ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2017 జనవరి నుంచి అమలు కావాల్సిన పే రివిజన్, పెన్షన్ రివిజన్ ఇంత వరకు అమలు చేయకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌బాబు ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ధ్వంసం చేస్తూ ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా స మస్యలపై పోరాటాలు చేసే వారిని చట్టసభలకు పంపాలని కోరారు. ధర్నాలో మధుసూదన్, బాల దుర్గయ్య, సాయిలు, సాయన్న, నారాయణరెడ్డి, రై జుద్దీన్, అనురాధ, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


