● మారంపల్లిలో ఆకట్టుకుంటున్న
మట్టి గణపతి
డొంకేశ్వర్(ఆర్మూర్): పర్యావరణ పరిరక్షణను చాటి చెబుతూ డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి రూపంలో కొలువైన మట్టి వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన ‘యోగి బ్యాచ్’ యూత్ ఆధ్వర్యంలో ఈ వినూత్న విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే గ్రామానికి చెందిన యువ కళాకారుడు బంజె రాజు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా, కేవలం తన చేతులతోనే ఈ మట్టి గణపతి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా, భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దారు. కేవలం మట్టితోనే ఈ రూపాన్ని తీసుకురావడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


