● 14 న కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
తెయూ(డిచ్‌పల్లి): పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి ప్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి సమీర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌త్‌ను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందని విమర్శించారు. శనివారం తెయూ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరిట ఒత్తిడి తీసుకువస్తున్నాయన్నారు. పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు బంద్‌కు మద్దతు తెలిపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమావేశంలో వర్సిటీ ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి అనిల్, నాయకులు లెనిన్, ప్రేమ్, విద్యార్థులు రామకృష్ణ, రాజు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.


