వర్ని: ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ సూచించారు. మోస్రా మండల కేంద్రంతోపాటు గోవురూలో ఓటరు నమోదు ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఓటరు జాబితా నమోదులో బూత్‌స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా నమోదును పూర్తి చేయాలని సూచించారు. సర్‌లో సమస్యలు తలెత్తకుండా చూ సుకోవాలని, ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపాలని, నిర్లక్ష్యం వహిస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట మో స్రా తహసీల్దార్ ధన్పాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ భూపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ సురేశ్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శులునరేందర్,శేఖర్ ఉన్నారు.


