రేపు పీఎం అప్రెంటిస్‌షిప్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు పీఎం అప్రెంటిస్‌షిప్‌ మేళా

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

రేపు పీఎం అప్రెంటిస్‌షిప్‌ మేళా డిచ్‌పల్లి ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్‌గా గంగాదాస్‌ జగన్నాథ రథయాత్రకు ఆహ్వానం వ్యభిచార గృహంపై దాడి

కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లోని ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో మహీంద్రా అండ్‌ మ హీంద్రా(జహీరాబాద్‌), ప్రీమియర్‌ ఎనర్జీస్‌(హైదరాబాద్‌)తోపాటు ఇతర స్థానిక పరిశ్రమల ప్రతినిధులు హాజరై అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తారన్నారు. వివిధ ట్రేడ్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం కోర్సు పూర్తి చేసుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆసక్తిగల అభ్యర్థులు వి ద్యార్హతకు సంబంధించి సర్టిఫికెట్లు, ఆధార్‌ ఒ రిజినల్‌,జిరాక్స్‌ ప్రతులతోపాటు పాస్‌పోర్ట్‌ సై జ్‌ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

డిచ్‌పల్లి : చారిత్రక ప్రసిద్ధి చెందిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయ కమిటీ నూతన చైర్మన్‌గా మాజీ సర్పంచ్‌ అప్పాల గంగాదాస్‌, హనుమాన్‌ ఆలయ కమిటీ చైర్మన్‌గా మారు రఘుపతి నియామకమయ్యారు. శనివారం సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులకు రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మికత పెంపొందించేలా ఖిల్లా రామాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామాలయం కమిటీ పాలకవర్గ సభ్యులు అశోక్‌, బూస రవి, చెలిమెల వినయ్‌, ఆర్మూర్‌ లలిత, ప్రధానార్చకులు కృష్ణమాచారితోపాటు హనుమాన్‌ ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు సూర శ్యామ్‌, ఆడెపు రాజు, కొంగ ప్రవీణ్‌, చిన్నముత్తవ్వ, మాజీ సర్పంచ్‌ బూస సుదర్శన్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్‌ రాంచందర్‌ గౌడ్‌, దాసరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌ : ఈ నెల 24న నగరంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి హాజరుకావాలని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌కు ఇస్కాన్‌ కంఠేశ్వర్‌ ప్రతినిధులు శనివారం ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఇస్కాన్‌ కంఠేశ్వర్‌ కేంద్రం ఆధ్వర్యంలో సేవా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభ వంగా నిర్వహిస్తున్నారన్నారు. జగన్నాథ రథయాత్రలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాదాసు స్వామి యాదవ్‌, ఇస్కాన్‌ ప్రతినిధులు నితాయ్‌ చంద్‌, సుమంత్‌, సూర్య, రోహిత్‌ పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని రెండో టౌ న్‌ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దా డి చేసి నిర్వాహకుడితోపాటు నలుగురు విటులను అరెస్టు చేశారు. వర్ని రోడ్డులోని ఫారెస్టు ఆఫీస్‌ కార్యాలయం సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండో టౌన్‌ పోలీసులు దాడి చేసి మాక్లూర్‌కు చెందిన ఇద్దరు, నందిపేటకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement