● బంగారు గొలుసు, నగదు అపహరణ
రుద్రూర్ : తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరికి చెందిన దొప్పలపూడి చందన గత నెల 1న సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి వచ్చి చూడగా ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం కూడా ధ్వంసం చేసి అందులో ఉన్న రెండు తులాల బంగారు గొలుసుతోపాటు కొంత నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.


