తనిఖీలు కరువు...
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
తనిఖీలు చేపడతాం..
● రసాయనాలతో తయారైన కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్న జనం
● మత్తుకు బానిసవుతున్న మరికొందరు
● పట్టించుకోని ఎౖకై ్సజ్ శాఖ
నిజామాబాద్‌అర్బన్: రసాయనాలతో తయారైన కృత్రిమ కల్లు ప్రజల ప్రాణాలను తీస్తోంది. మరికొందరు ఆ మత్తుకు బానిసై తమ ఆరోగ్యంతోపాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయినా అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఎకై ్సజ్ శాఖ ప్రతినెల మాముళ్లకు అలవాటు పడి విచ్చలవిడిగా కృత్రిమ కల్లు విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
జిల్లా కేంద్రంలో మూడు డిపోలు..
జిల్లా కేంద్రంలో మూడు కల్లు డిపోలు కొనసాగుతున్నాయి. రోజుకు లక్షకు పైబడి లీటర్ల కృత్రిమ కల్లు తయారవుతుంది. చుట్టుపక్కల ఈతవనాలు లేకపోవడంతో రసాయనలతోనే కల్లు తయారువుతుంది. ఇందులో అల్ఫ్రాజోమ్, డైజోఫామ్, శాక్రిమ్, కుంకుడు రసం తదితర రసాయనాలతో ఈ కల్లును తయారు చేస్తున్నారు. 280 మంది సభ్యులు కలిగి ఉన్న ఒకటి, రెండు డిపోల పరిధిలో 11 దుకాణాలు ఉన్నాయి. కేవలం 60 మంది సభ్యులు మాత్రమే కలిగి ఉన్న మూడో డిపో మూడులో ఏకంగా 23 దుకాణాలు కొనసాగుతున్నాయి. మరో 6 అనధికారిక దుకాణాలు ఉన్నాయ ని సమాచారం. ఇందులో ప్రతిరోజు 70 వేల నుంచి లక్ష లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి.
ఎన్నో అనర్థాలు..
కృత్రిమ కల్లు మనుషులను మానసిక స్థితిని చెరిపేస్తుంది.ఈ కల్లు సేవించిన వారు ప్రాణాలు కో ల్పోతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగి కల్లు డిపోలో ని కాంపౌండులో మరణించాడు. ఇలా అనేక ప్రాంతాల్లోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. కల్లు కు అలవాటు పడి మతిస్థిమితం లేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. కొందరు కల్లు లేనిదే ఒక్కరోజు కూడా ఉండడం లే దు. గల్ఫ్ దేశాలు వెళ్తున్నవారికి అక్కడ కల్లు దొరక్క తప్పిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతున్నా.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అ ధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కల్లు డిపోలో తయారీ విధానంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు తరుచు తనిఖీలు చేపట్టాలి. కల్లు తయారీలో ఎలాంటి వాటిని ఉపయోగిస్తున్నారో పరిశీలించాలి. నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు తనిఖీలను మరవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిషేదిత పదార్థాలను వినియోగించి, కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కృత్రిమ కల్లు తయారుచేసే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కృత్రిమకల్లు విక్రయాలను నిలిపివేయించాలని ప్రజలు కోరుతున్నారు.
రసాయనాలతో తయారు చేసే కల్లు వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మఖ్యంగా మెదడు మొద్దుబారి ఫిట్స్ రావడం, నరాలు తీవ్రంగా దెబ్బతినడం, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. గర్భిణులకు కల్లు తాగించడం వల్ల బుద్ధిమాంద్యం గల పిల్లలు పుడుతున్నారు. – విశాల్,
మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్ నిజామాబాద్
కల్లు తయారీ కేంద్రల్లో తనిఖీలు చేపడతాం. తయారీ కేంద్రాల్లో రసాయనాలు, నిషేధిత పదార్థాలు లభిస్తే, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లో కృత్రిమ కల్లు విక్రయించడానికి వీలులేదు. కల్లు డిపో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి.
–నందగోపాల్, సూపరింటెండెంట్,
జిల్లా ఎకై ్సజ్ శాఖ, నిజామాబాద్


