విద్యుత్‌ మరమ్మతులు.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ మరమ్మతులు..

Jul 6 2026 2:04 AM | Updated on Jul 6 2026 2:04 AM

వర్షాకాలంలో పొలాల్లో ఉన్న కరెంట్‌ మోటార్లలో వర్షపు నీరు చేరి సమస్యలు వస్తుంటాయి. వీటిని సరిచేసేందుకు రైతులు జాగ్రత్తలు పాటించకుండా మోటార్లను ముట్టుకోవడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

● మోటార్‌ బోర్డులు, స్టార్టర్లు వర్షానికి తడవకుండా ప్లాస్టిక్‌ డబ్బాలను అమర్చుకోవాలి

● మోటార్లను ఆన్‌, ఆఫ్‌ చేసే సమయాల్లో చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి

● చేతులకు గ్లౌవ్స్‌లను వాడటం వల్ల విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు

● రైతులు ఎప్పుడు వెంట టెస్టర్‌ను, కాళ్లకు పాదరక్షలు ఉంచుకుంటే మంచిది

● ట్రాన్స్‌ఫార్మర్లు, బోరు మోటార్ల సమస్యలు వస్తే విద్యుత్‌ శాఖ సిబ్బందితోనే మరమ్మతులు చేయించుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement