అప్రమత్తంగా ఉండాలి
● అన్నదాతలకు ప్రకృతి వైపరీత్యాలు,
రసాయనాల స్ప్రే, విద్యుత్ రూపంలో పొంచివున్న ప్రమాదాలు
● అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు
బోధన్‌రూరల్: ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వర్షాలు లేటుగా కురవడంతో ఇప్పుడిప్పుడే రైతన్నలు పంటల సాగు పనులు ముమ్మరం చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే శ్రమిస్తూ అన్నదాతలు, వ్యవసాయ కూలీలు పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. ఈక్రమంలో వారికి అనుకోకుండా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, క్రిమికీటకాలు, విద్యుత్ మరమ్మత్తులు, మందుల పిచికారి వంటి పనుల్లో ప్రమాదాలు పొంచిఉంటున్నాయి. అప్రమత్తతంగా లేకపోవడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రమాదాలను నివారించవచ్చ ని వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు పే ర్కొంటున్నారు.వారి సలహాలు, సూచనలు ఇలా..
క్రిమికీటకాలు..
వర్షాకాలంలో పాములు, తేళ్లు, విషపురుగులు, కీటకాల సంచారం కూడ ఎక్కువగా ఉంటుంది. పంటపొలాల్లోని గట్ల వెంబడి పాములు, విష కీటకాలు, పురుగులు సంచరించడంతోపాటు కాటు వేసే అవకాశం ఉంది. కావున రైతులు గట్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి తప్పిదాలతో ప్రమాదాలకు గురవుతుంటారు. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు. వానాకాలం సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్ మరమ్మతుల సమయాల్లో రైతులు, కూలీలు ప్రమాదాలకు గురవుతుంటారు. అప్రతమత్తత, జాగ్రత్తతో వ్యవహరిస్తే ప్రమాదాలకు గురవకుండా ఉండవచ్చు. – శ్రీనివాస్,
వ్యవసాయ డివిజన్ అధికారి (ఏడీఏ), బోధన్


