రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

బాధితులను ఆస్పత్రికి తరలించిన

ప్రభుత్వసలహాదారు షబ్బీర్‌అలీ

భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడగా, అటుగా వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ క్షతగాత్రులను గమనించి, అంబులెన్స్‌లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డిలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. భిక్కనూరు సమీపంలో షబ్బీర్‌ అలీ కాన్వయ్‌ ముందు వెళ్తున్న ఓ కారు టైరు పేలి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని దంపతులతోపాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే షబ్బీర్‌ అలీ ప్రమాదాన్ని గమనించి, తన వాహనాన్ని నిలిపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. వారిని బయటకు రప్పించి, వివరాలు తెలుసుకున్నారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వైద్యులకు ఫోన్‌ చేసి వైద్యం వెంటనే అందించాలని సూచించారు. దీన్ని గమనించిన అక్కడి ప్రజలు షబ్బీర్‌అలీని అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement