కరెంట్‌షాక్‌తో మెకానిక్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌షాక్‌తో మెకానిక్‌ మృతి

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఆర్మూర్‌టౌన్‌: బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా ఓ మెకానిక్‌ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన పన్నీరు శ్రీనివాస్‌(46) బోర్‌మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. పెర్కిట్‌లోని అల్లూరి నాగరాజు పొలంలో ఆదివారం శ్రీనివాస్‌ బోరు మోటారును రిపేరు చేయడానికి వెళ్లాడు. మోటారుకు మరమ్మతులు చేస్తుండగా అతడికి సర్వీస్‌వైరు ప్రమాదవశాత్తు తగలంతో కరెంట్‌ షాక్‌కు గురైయ్యాడు. పక్కనే ఉన్న నాగభూషణం అనే వ్యక్తి కర్ర సహాయంతో శ్రీనివాస్‌ను కాపాడి వెంటనే ఆర్మూర్‌ ప్రభుత్వ అస్పత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు పరిశీలించగా మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడు బైపాస్‌ వద్ద భిక్షాటన చేస్తుండేవాడని స్థానికులు తెలిపారన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మృత దేహన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement