బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర చౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును ఆదివారం కూల్చివేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ ద్వారా పాత బాన్సువాడకు తాగునీటిని సరఫరా చేశారు. కొన్ని నెలల క్రితం ట్యాంకు లోపల పెచ్చులూడిపడుతుండటంతో నీటిని సరఫరా నిలిపివేశారు. నేరుగా పైపులైను ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకుతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. కాగా, పాత బాన్సువాడ మసీద్ వెనుక అమృత్ 2.0 పథకం కింద నూతనంగా ట్యాంకును నిర్మిస్తున్నారు.


