పట్టాలెక్కిన ఎవుసం! | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన ఎవుసం!

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ లో వర్షాలు కురవకపోవడంతో ఆగమైన ఎవుసం ఇప్పుడు పట్టాలెక్కింది. ఈ నెల ప్రారంభం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. వరినారు ఎదగడంతో జిల్లా వ్యాప్తంగా నాట్లు జోరందుకున్నాయి. ఒక పక్క ట్రాక్టర్లతో పొలాన్ని దమ్ము చేయిస్తూ మరో పక్క కూలీలతో వెంట వెంట నాట్లు వేయిస్తున్నారు. పసుపు, సోయా విత్తనాలు విత్తడం దాదా పు పూర్తి కాగా, మక్క విత్తనాలు విత్తుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఆయా పంటలు మొత్తం 5.30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 2లక్షల ఎకరాల వరకు పంటలు సాగులోకి రాగా.. ఇందులో వరి విస్తీర్ణం 1.15 లక్షల ఎకరాలుగా ఉంది. సరిగ్గా వారం రోజుల క్రితం 21 వేల ఎకరాల్లోనే వరినాట్లు పూర్తికాగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరినాట్లు పూర్తయిన విస్తీర్ణం ఏకంగా 94వేల ఎకరాలకు పెరగడం గమనార్హం. మరో పది రోజుల్లో పనులు మరింత ఊపందుకోనుండగా, జూలై నెలంతా వరినాట్లు వేయనున్నారు. వరినాట్లు వేసేందుకు ఏపీ, బీహార్‌, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూలీలు జిల్లాకు వచ్చారు. కాగా, ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకే బోనస్‌ ఇస్తామని చెప్పడంతో రైతులంతా అవే రకాలను సాగు చేస్తున్నారు. వేరే రకాల జోలికి అసలే పోలేదు.

సమయానికి ‘భరోసా’

ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయనే ఆనందంలో ఉన్న రైతన్నలు సరైన సమయంలో ప్రభుత్వం రైతుభరోసా జమ చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేలు ఇవ్వడంతో కూలీలకు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు ఉప యోగపడుతున్నాయి. జిల్లాలో శనివారం నాటికి ఆరెకరాల వరకు 2,68,177మంది రైతులకు రూ.280.56 కోట్లు జమయ్యాయి. ఎప్పుడు కావాలంటే అప్పు డు యాప్‌లో యూరియా లభిస్తోంది. ఇప్పటి వరకు 1,98,782మంది రైతులు 6,63లక్షల బస్తాలను కొనుగోలు చేయగా, జిల్లా లో ఇంకా 1.91లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నాయి.

పంట వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు

అంచనా సాగులోకి వచ్చింది

వరి 4,38,521 1,15,000

మొక్కజొన్న 55,000 42,019

సోయా 34,227 23,457

కంది 994 430

పెసర 37 55

మినుము 65 52

పత్తి 993 610

జిల్లాలో పంటల సాగు అంచనా..

సాగులోకి వచ్చిన విస్తీర్ణం

కురుస్తున్న వర్షాలు.. జోరందుకున్న సాగు పనులు

బిజీగా మారిన రైతన్న

వారంలోనే 91 వేల ఎకరాల్లో నాట్లు

మొత్తం సన్నరకాలే వేస్తున్నా

వర్షాలు కురుస్తుండ డంతో వరి సాగు పనులు మొదలు పె ట్టా. సన్నాలకే ప్రభు త్వం బోనస్‌ ఇస్తామ ని చెప్పడంతో ఏడు ఎకరాల్లో సన్నాలే సాగు చేస్తున్నా. ప్రస్తుతం మూడెకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. సరైన సమయంలో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించడంతో ఖర్చులకు ఆసరా అయ్యింది.

– అల్లారి నవీన్‌, తొండాకూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement