హామీలను నెరవేరుస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

హామీలను నెరవేరుస్తున్నాం

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

యువత జూదానికి దూరంగా ఉండాలి

ధర్పల్లి: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌ రెడ్డి అన్నారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలో ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధు లు సర్‌లో భాగస్వాములు కావాలని, అర్హు ల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్య త నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఓటర్లు సర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఎన్యుమరేషన్‌ పత్రాలను నింపడానికి వలంటీర్లను నియమించిన సర్పంచ్‌ను ఆయన అభినందించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్‌ బాలరాజు, సర్పంచ్‌ చెలిమెల శ్రీనివాస్‌, నాయకులు మనోహర్‌రెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర

ఎల్లారెడ్డి: యువత జూదానికి దూరంగా ఉండాలని, అది కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి శివారులో పేకాడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి రూ.21,350 నగదు, ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వెచ్చించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. జూదం, గేమింగ్‌ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్‌ 100కు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రూరల్‌ ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

నిజామాబాద్‌ రూరల్‌: పంచాయతీరాజ్‌ ఎస్‌ఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శంకర్‌నాయక్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌లో ఉన్న క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేను ఆయన ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పలు అంశాలపై చర్చించారు. విధినిర్వహణలో అంకితభావంతో పని చేయాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement